పుచ్చకాయ చలివేంద్రం ప్రారంభం

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యువ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు వేసవి తాపం నుండి రక్షణ కలిగించేందుకు పుచ్చకాయ చలివేంద్రం నిర్వహించారు. 

 ముందుగా ఈ చలివేంద్రాన్ని యువ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గేదెల లక్ష్మణరావు పుర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించి మాట్లాడుతూ ఈ చలివేంద్రంలో ప్రతిరోజు పుచ్చకాయ జ్యూస్, చల్లని మంచినీరు అందించి ప్రజలకు వడదెబ్బ తగలకుండా వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తామని తెలియజేశారు. 

ఈ వేసవి నెలలో ప్రతి రోజు 50 కిలోల నుండి 70 కిలోల వరకు పుచ్చకాయలను ఈ చలివేంద్రంలో జ్యూస్ కు వాడతామని, ఈ వేసవి నెలలో నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు. మిగిలిపోయిన పుచ్చకాయ తొక్కలను ఎక్కడ పారవేయకుండా దేవాలయం పరిధిలో చుట్టుపక్కల ఉన్న పశువులకు దాణాగా అందిస్తామని తెలియజేశారు. 

మేము చేసే సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కోరాడ శ్రీనివాస్ 70 కిలోల చక్కెర అందించారని మరియు శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ట్రస్ట్ 1000 కిలోల పుచ్చకాయలు అందించినందుకు వారికి ఈ సందర్భంగా యువ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గేదెల లక్ష్మణరావు ధన్యవాదాలు తెలియజేశారు.








 


Gedala Rishi

మా అన్న ప్రజా సేవకుడు, ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం చేయడం మా అన్న ప్రయత్నం

Post a Comment

Previous Post Next Post