పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు జరిగిన వరలక్ష్మీ వ్రతం పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న భక్తులకు గేదల లక్ష్మణరావు వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గార్ల ఆధ్వర్యంలో సుమారు 650 మంది ముత్తయిదువులకు పసుపు కుంకుమ జాకెట్లు పళ్ళు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ క్షీర రామలింగేశ్వరుడు వరలక్ష్మి మాత ఆశీస్సుల తో అందరి కుటుంబాలు సిరి సంపదలతో సౌభాగ్యాలతో చల్లగా ఆనందమయంగా ఉండాలంటూ స్వామివారిని లక్ష్మణరావు దంపతులు ప్రార్ధించారు..