రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి పునాదులని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు నియోజకవర్గ నాయకులు, సిరి ప్లెక్స్ అధినేత గేదల లక్ష్మణరావు అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాలకొల్లు నియోజకవర్గంలోని 35 వార్డుల్లో నిర్వహిస్తోన్న గడప గడపకు వైసీపీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా,
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయబావుటా ఎగురవేయ్యడంపై గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సమక్షంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, నూతన పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు,
జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, అనంతరం రానున్న ఎన్నికల్లో పార్టీ మరింత ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని కోరుతూ గడప గడపకు వై.సి.పి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపినందుకుగాను గేదల లక్ష్మణరావు ఏలూరులోని జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి వైసిపి పాలకొల్లు నాయకులు గేదల లక్ష్మణరావు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
లక్ష్మణరావు మాట్లాడుతూ తనకు అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచినందుకు జడ్పీ చైర్మన్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.