పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు పట్టణం నందు యువ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గేదల లక్ష్మణరావు వినూత్న రీతిలో స్థానిక ప్రజలకు, బాటసారులకు, వాహనదారులకు చల్లని పుచ్చకాయ జ్యూస్ చలివేంద్రం గత కొన్ని రోజులుగా ఏర్పాటు చేసిన విషయం అందరికీ విధితమే. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసినదే, స్వతాగా వైసిపి నాయకుడు అయినటువంటి సిరి ఫ్లెక్స్ అధినేత, గేదల లక్ష్మణరావు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించి సేవా సైనికునిగా ఖ్యాతిని అందుకున్నరు. ఎంతో ప్రజాకర్షణ కలిగిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం చెయ్యలేని సహాసన్ని సాహస వంతమైన సేవా కార్యక్రమాలు గత కొన్ని ఏళ్లుగా నిర్వహిస్తూ ప్రజల మరియు ప్రముఖుల మన్ననలు పొందడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లు పెద్దగోపురం సెంటర్ నందు పుచ్చకాయ చలివేంద్రం ప్రారంభించి ఈరోజుకు 30 రోజుల కావడం విశేషం. వాతావరణం చల్లబడటంతో ఈ కార్యక్రమానికి ఇక్కడితో స్వస్తి పలికి మరో సేవా కార్యక్రమం తో మీ ముందుకు రావాలనుకున్న నన్ను అనగా గేదెల లక్ష్మణరావు పుర ప్రజలందరూ దీవిస్తారని అలాగే మీ అందరి సహకారంతో మరో సేవా కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈ చలివేంద్రాన్ని 30వ రోజు. ప్రతిరోజు లాగే పుచ్చకాయ జ్యూస్, చల్లని మంచినీరు అందించి ప్రజలకు వడదెబ్బ తగలకుండా వేసవి తాపం నుండి ఉపశమనం కలిగిస్తామని తెలియజేశారు. ఈ రోజు 200 కిలోల పుచ్చకాయలను ఈ చలివేంద్రంలో జ్యూస్ కు వాడమాని, ఈ కార్యక్రమం ద్వారా నన్ను ప్రజలకు తమ తమ పత్రికలు టీవీ ఛానల్ ద్వారా చేరవేసిన మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గేదల లక్ష్మణరావు సిరి ఫ్లెక్స్ అధినేత వైసిపి నాయకులు....