వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ సారధుల వ్యవస్థను పరిచయ వేదిక వల్లంపరు గ్రామంలో 15-02-2023 విజయవంతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో గేదల లక్ష్మణరావు గారు, మద్దాల వాసు గారు, జే సి ఎస్ పాలకొల్లు టౌన్, సచివాలయం కన్వీనర్స్ రావాడ సతీష్ గారు, యండ్ర ప్రసాద్, ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమము జరుపబడినది. గేదల లక్ష్మణరావు గారు మాట్లాడుతూ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం పరచాలని కోరారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గృహ సారధుల వ్యవస్థ ద్వారా సచివాలయం కన్వీనర్స్ ఆధ్వర్యంలో ఇంటికి వెళ్లి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం పరచడమే ఈ యొక్క కన్వీనర్స్ లక్ష్యం. All the Best to Jagannna.
➤ రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల గృహ సారథులను, 45 వేల మంది పార్టీ కన్వీనర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం.
ఏపి లో ప్రతి 50 కుటుంబాలకు ఇద్దరు పార్టీ గృహ సారథులు (పార్టీ వాలంటీర్లు) ను నియమించనున్న వైసీపీ.
ప్రతి సచివాలయం పరిధిలో ముగ్గురు పార్టీ కన్వీనర్లు..రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల గృహ సారథులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం.
ఎలా నియమిస్తారు?
Gruha Sarathulu (volunteers)- ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్ గా తీసుకుంటారు.ప్రతి క్లస్టర్ కి ఇద్దరు పార్టీ గృహ సారథులు (పార్టీ వాలంటీర్లు) ను నియమిస్తారు
- ప్రతి ఇద్దరు గృహ సారథులలో ఒక మహిళా ఒక పురుషుడు ఉంటారు.
- రాష్ట్రవ్యాప్తంగా 5.2 లక్షల గృహ సారథులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలలో నియామకం
Conveners
- ప్రతి సచివాలయానికి ముగ్గురు చప్పున పార్టీ కన్వీనర్లు
- రాజకీయంగా అవగాహనా ఉన్నవారికే అవకాశం
- ప్రతి ముగ్గురిలో ఒకరు మహిళా ఉంటారు
- రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల మందిని నియమిస్తారు
గృహ సారథులు మరియు కన్వీనర్ల బాధ్యతలు
✪ 15 రోజుల వ్యవధిలో అన్ని కుటుంబాలను సారథులు కలుసుకోవాలి. ఒకవైపు ఎమ్మెల్యేలు గడపగడపకూ తిరుగుతూనే.. మరోవైపు సచివాలయాలకు ఎంపిక చేసిన పార్టీ కన్వీనర్లు కూడా గడపగడపకూ తిరుగుతారని ప్రభుత్వం తెలిపింది.
✪ అన్ని క్లస్టర్ మరియు సచివాలయాల పరిధిలో పార్టీ కార్యక్రమాలు చురుగ్గా కొనసాగడానికి వీరు పని చేస్తారు. ఇక కన్వీనర్లు అన్నవారు స్థానికంగా నివసించిన వారై ఉండాలి. కన్వీకనర్ల ఎంపిక తర్వాత తదనంతరం ప్రతి యాభై ఇళ్ల క్లస్టర్‌కు ఇద్దరు చొప్పున గృహసారథులను ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గృహసారథులు కూడా అదే క్లస్టర్లకు చెందినవారై ఉండాలి.
✪ సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లు, గృహ సారథుల పనితీరుపై నిరంతరం మదింపు ఉంటుంది. వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు.
✪ ఈ కార్యక్రమాల ద్వారా బూత్ కమిటీ నుంచి బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. నెట్‌వర్క్ బలంగా ఉండడం వల్ల గెలవటం అన్నది చాలా సులభం అవుతుందని వైసిపి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎమ్మెల్యేను గెలిపించాలన్నదే ఇందులో ఉండే పరిశీలకుల లక్ష్యం కావాలి.
✪ డిసెంబర్20లోగా సచివాలయాల పరిధిలో కన్వీనర్ల నియామకం పూర్తయ్యేలా చూడాలి.
✪ నెల రోజుల్లో పార్టీ సారథులను కూడా ఎంపిక చేయాలని సీఎం ఆదేశించారు.
✪ పార్టీలో ఎక్కడైనా చిన్న చిన్న బేధాలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల పరిశీలకులపై ఉంది.
బెనిఫిట్స్
✻ భవిష్యత్తులో పార్టీ నుంచి తప్పక గుర్తింపు ఉంటుందని సీఎం తెలిపారు.
✻ వీరందరికీ ఉచిత జీవిత బీమా ఉంటుంది. పార్టీ విస్తృతస్థాయి సమావేశాలకు వీరు ఆహ్వానితులుగా ఉంటారు.