పాలకొల్లు పట్టణంలోని వార్డులలో గుడ్ మార్నింగ్ పాలకొల్లు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్, పాలకొల్లు వైసీపీ ఇంచార్జ్ కవురు శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా, వైసీపీ నేతలతో కలిసి వార్డులలో విరివిగా తిరుగుతూ, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలకు వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన వైఎస్సార్ ఈ.బి.సి నేస్తం, సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, వైసీపీ నాయకుడు, సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు సహకారంతో ముద్రించిన కరపత్రాలను జెడ్.పి చైర్మన్ ఇతర వైఎస్సార్సీపీ నాయకులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ కరపత్రాలలో, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం వివరాలను, విపులంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ముద్రించారు. మంగళవారం, 22వ వార్డులో ఈకరపత్రాలను ప్రజలకు ఇంటింటా అందించి, వైయస్సార్ ఈ.బి.సి నేస్తం పై అవగాహన కల్పించారు. కరపత్రాలను ముద్రించిన వైసీపీ నేత గేదల లక్ష్మణరావును,జెడ్పీ చైర్మన్ ప్రత్యేకంగా అభినందించా
ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, వైయస్సార్ సిపి సీనియర్ నేత గుణ్ణం నాగబాబు, మద్దా చంద్రకళ, మోర్త గిరీష్, పాలపర్తి కృపనాధ్, బండి రమేష్, పెచ్చెట్టి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు