ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వై. యస్. జగన్ మోహనరెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకుని వైసీపీ నాయకులు సిరి ఫ్లెక్స్ అధినేత గేదల లక్ష్మణ రావు పాలకొల్లు పట్టణంలో 150 మంది వృద్దులకు, వికలాంగులకు,యాచాకులకుభోజనం పాకెట్స్ అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పది కాలాలు ఉండాలని పలువురు ఆశీర్వదించరు. అనంతరం పలు సంక్షేమ పథకాలు పేదలైన తమకు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గతంలో వారిని ఏ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులు అయినా తమకు తమ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు పరిపూర్ణంగా అందిస్తున్నారని లక్ష్మణ్ రావు కు పలువురు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు జరిగినా తమ మద్దతు జగన్మోహన్రెడ్డి ఉంటుందని జై జగన్ జై జై జగన్ అంటూ పలువురు జై జై లు పలికారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి అడుగుజాడల్లో నడవడం వారిని ఆదర్శంగా తీసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని లక్ష్మణ్ రావు ఆనందం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో గొల్లమందుల మధుబాబు, జి. వి. రత్నం నల్లి రమేష్, బుడితి సురేష్ పాల్గొన్నారు.
ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వై. యస్. జగన్ మోహనరెడ్డి గారి పుట్టినరోజు పురస్కరించుకుని
byGedala Rishi
-
0